ఎత్తైన కొండను ఎక్కించుమయ్య అద్దరికి నన్ను

ఎత్తైన కొండను ఎక్కించుమయ్య అద్దరికి నన్ను

ఎత్తైన కొండను ఎక్కించుమయ్య
అద్దరికి నన్ను దాటించుమయ్య
నీవె నా దుర్గము – నీవె నాకేడెము
నీవె నా ఆశ్రయము – నీవె నా సమస్తము

1•
నాకృప నీకు చాలును
నీతో కూడ నేను ఉందును
నిన్ను నేను విడువను
ఎన్నడు ఎడబాయను ॥ఎతైన॥

2•
నా పాదములు జారుటకు
కొంచెమే తప్పెను
నా చెయ్యి నీవు విడువక
నన్ను బండమీద నిలుపుము ॥ఎతైన॥

3•
గాలి తుఫానులు వీచగా
అలలచే కొట్టబడగా
నా ఓడను కాపాడుము
తీరానికి నన్ను చేర్చుము ॥ఎతైన॥

4•
సముద్రములో త్రోవను
కలుగజేయు వాడను
వడిగల జలములలో
నేను త్రోవను నీకు చేతును ॥ఎతైన॥

Leave a Comment