యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె
యేసురాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే హోసన్నా జయం మనకే
1•
యోర్ధాను ఎదురైనా ఎఱ్ఱ సాంధ్రము
పొంగి పొర్లిన భయము లేదు జయము మనకే
విజయ గీతము పాడెదము ॥హోసన్నా॥
2•
శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైన
యేసు గాయముల్ స్వస్థ వరచును
రక్తమే రక్షణ నిచ్చున్ ॥హోసన్నా॥
3•
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ
యేసు రాజు మనకు ప్రభువై /
త్వరగా వచ్చుచుండె ॥హోసన్నా॥