యేసుక్రీస్తు అందరికీ ప్రభువు
భూమ్యకాశములన్ సృజంచిన /
దేవుడాయనే… భూప్రజలందరిని /
రక్షించే రక్షకుడాయనే ||2||యేసు||
1•
చీకటి శక్తులపైన అధికారం గలవాడు
దయ్యపు శక్తులనైనా పారద్రోలును ||2||
దేహములోని బలహీనతకు
అంతే చిక్కని అనారోగ్యతకు
మనసుకు కలిగిన వేదనలకు
స్వస్థతనిచ్చేను /
యేసు స్వస్థపరచేను ||2||యేసు||
2•
మరణాన్నే జయించిన జీవం గలవాడు
సమాధినుండి లేచిన సజీవుడాయనే ||2||
నీవే దిక్కని మొక్కినవారికి
సకల పాపములు పోగొట్టి
నరకం నుండి తప్పించి
స్వర్గమునిచ్చేను /
యేసు స్వర్గము చేర్చును ||2||యేసు||