యేసు నీ కృపలో మమ్ము కాపాడుము
యేసు నీ కృపలో మమ్ము కాపాడుము
దేవా మమ్ము రక్షించి నిత్య రాజ్యములో
నడుపుము మా ప్రభువా
1•
సిలువను మోసుకొని సువార్తన్ చాటింప
బలమగు నీ శక్తిచే నిత్యము నడిపించు
నన్ను నీ ఆత్మలో పూర్ణునిగాజేసి
నిలుపుము జ్యోతి వలె /
నిలుపుము జ్యోతివలె ||యేసు||
2•
కృంగిన వేళలలో అలసిన సమయములో
నా చెయ్యవిడువకను నన్ను నిలబెట్టు
నీ రాకడలో నేను నిన్నెదుర్కొనుటకు
నీకృప నీయుమయా / నీ కృప నీ యుమయా