యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు
యేసునాధుని యోధులందరు
వాసిగ నిటరండు/ వేగమె /
వాసిగ నిటరండు = భాసురముగప్రభు
జన్మము బాడుచు / నాసతోడ రండు /
వేగమె యాసతోడ రండు ॥జే జయం॥
1•
దూతలమాదిరి గాత్రము లెత్తుచు/
గీతము బాడుండి/
వేగమె -గీతము బాడుండి =
దాతయౌ మన క్రీస్తుని నీతిని /
ఖ్యాతిగ బలుకుండి /
వేగమె ఖ్యాతిగ బలుకుండి ॥జే జయం||
2•
గొల్లలు ప్రభు కడకేగిన రీతిని /
నెల్లరు నడువుండి-వేగమె-యెల్లరు నడువుండి
= ఉల్లములందున సంతసించి ప్రభు /
నెల్లెడ దెలుపుండి /
వేగమె యెల్లడ దెలుపుండి ||జే జయం||
3•
జ్ఞానుల భంగిని మానవులందరు /
కానుక లియ్యుండి/
వేగమె కానుక లియ్యుండి
= మానవకోటికి రక్షణ భాగ్యము /
దానము బొందుండి /
వేగమె దానము బొందుండి ||జే జయం॥
4•
మరియ రీతిగను మనసు లోపలను
మురియుచు నుండుండి /
వేగమె కానుక లియ్యుండి =
మానవకోటికి రక్షణ భాగ్యము /
దానము బొందుండి- వేగమె /
దానము బొందుండి ॥జే జయం॥
5•
జయజయ శబ్దము జేయుచు ప్రభునకు /
జయమని పాడుండి వేగమె/
జయమని పాడుండి = జయజయ మంచును/
జయ శబ్దముతో జయముల నొందుండి/
వేగమె /జయముల నొందుండి ॥జే జయం||
– మత్తయి సమూయేలు