యేసయ్య పుట్టినాడు లెండయ్యో లెండయ్య

యేసయ్య పుట్టినాడు లెండయ్యో లెండయ్య


యేసయ్య పుట్టినాడు లెండయ్యో లెండయ్య
రక్షకుడు ఉదయించాడు లెండమ్మొ లెండమ్మా
పాపమును పారద్రోలు రాజు /
మనకు పుట్టినాడులే   ॥యేసయ్య॥

1•
రాత్రివేళ గొల్లలు మందకాయుచుండగా
దేవదూత వారికి కనిపించి చెప్పగా
మీ కొరకు రారాజు జన్మించినాడంటూ
                                            ॥యేసయ్య॥

2•
తూర్పున జ్ఞానులు చుక్కను కనుగొని
మక్కువతో ప్రభుని చూడ బేత్లహేము కొచ్చిరి
బంగారు సాంబ్రాణి బోళములర్పించిరి
                                          ॥యేసయ్య॥


రచన: మన్నా మినిస్ట్రీస్

Leave a Comment