యేసయ్య నామము ప్రీతిగల నామము
యేసయ్య నామము – ప్రీతిగల నామము
సాటిలేని నామము – మధుర నామము
1•
పాపము పోవును భయమును పోవును (2)
పరమ సంతోషము – భక్తులకీయును (2)
||యేసయ్య||
2•
పరిమళ తైలము – యేసయ్య నామము
భువిలో సువాసన – యిచ్చెడి నామము
||యేసయ్య||
3•
భులోకమంతట – మేలైన నామము
సైన్యాధిపతియగు – యేసయ్య నామము
||యేసయ్య||
4•
నిన్న నేడు – మారని నామము
నమ్మిన వారిని – విడువని నామము
||యేసయ్య||
5•
ప్రతివాని మోకాలు, వంచెడి నామము
ప్రతివాని నాలుక – స్తుతించెడి నామము
||యేసయ్య||
6•
సాతాను సేనను జయించిన నామము
పాప పిశాచిని తరిమెడి నామము
||యేసయ్య||
7.•
భక్తుల కాచెడి – శక్తిగల నామము
పరమున చేర్చెడి – పరిశుద్ధ నామము
||యేసయ్య||