యేసయ్య జన్మించె పశులపాక యందు
యేసయ్య జన్మించె పశులపాక యందు
ఎంతో సంతసము భూలోకమందు
దావీదు వంశాన కన్య మరియ గర్భాన
నాథుడుద్భవించె నేడు
క్రిస్మస్ క్రిస్మస్॥యేసయ్య॥
1•
పరమందు దూత తెల్పె శుభవార్త /
మీ కొరకు రక్షకుడు పాకలో పుట్టినాడని
గొల్ల బోయలంత ఘల్లున గంతులు వేస్తూ
బాలయేసు చెంత జేరి పూజించిరి ॥యేసయ్య॥
అ.ప.
అభిషిక్తుడు రక్షకుండు ఇమ్మానుయేలువాడు
పాపాలను బాపువాడు శ్రీ యేసుడే
పాపుల పాలిటి పెన్నిధి బాల యేసుడే
॥యేసయ్య॥
2•
పరమందు తార చూపింది దారి /
రాజులకు రారాజు నేడె పుట్టినాడని
జ్ఞానులకంత కలిగింది వింత /
కానుకలు అర్పించి పూజించిరి॥యేసయ్య॥
రచన: మన్నా మినిస్ట్రీస్