ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్య

ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్య

ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్య /
నీ జననమెంత దయ నీయమో
తలచుకుంటే నాగుండె తడబడి
కరిగి కరిగి నీరవు చున్నది

1•
నీ సృష్టిలో ఈ లోకమే /
నీవు మాకిచ్చిన సత్రమయ్యా
ఆ సత్రంలో ఓ యేసయ్య /
నీకు స్థలమే దొరకలేదయ్య

2•
నిండు చూలాలు మరియమ్మ తల్లి /
నడవలేక సుడివడీ పోయెనయ్య
దిక్కుతోచక ఓ యేసయ్య /
పశుల పాకలో ప్రసవించెనయ్య

3•
చల్లగాలిలో చాటు లేక /
నలుమూలలా చలి పుట్టెనయ్య
పసి కందువై ఓ యేసయ్య /
తల్లి ఒడిలో ఒదిగి నావయ్య


రచన: ప్రభుదేవా మినిస్ట్రీస్

Leave a Comment