ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే

ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే

ఎన్ని తలచినా / ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా /
జరిగేది నీ చిత్తమే
నీ వాక్కుకై వేచి యుంటిని /
నా ప్రార్ధన ఆలకించుమా ప్రభువా

1•
నీ తోడులేక, నీ ప్రేమలేక,
ఇలలోన ఏప్రాణీ బ్రతుకలేదు
అడవి పువ్వులే, నీ ప్రేమ పొందగా
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా ॥ఎన్ని॥

2•
నా యింటిదీపం, నీవేయని తెలిసి,
నా హృదయం నీ కొరకు పదిలపరచితి
ఆరిపోయిన నా వెలుగు దీపము
వెలిగించుము నీప్రేమతో ॥ఎన్ని॥

3•
ఆపదలు నన్ను, వెన్నంటియున్న,
నా కాపరినీవై నన్నాదు కొంటివి
లోకమంతయు, నన్ను విడిచినా
నీనుండి వేరుజేయవు ప్రభువా ॥ఎన్ని॥

Leave a Comment