ఎమ్మాయి దారులలో కృంగిన వేళలలో
ఎమ్మాయి దారులలో / కృంగిన వేళలలో
నాయేసు నడచెనుగా / నాకన్నులు తెరచెనుగా
అ. ప:
యేసే అజేయుడు /
నాయేసు సజీవుడు హల్లెలూయా
యేసే ఆరాధ్యుడు / నా యేసు ప్రాణ ప్రియుడు
1•
అకోరు లోయలలోన / గాఢాంధకారములోన
నడచిన ఒంటరికాను /
నాయేసు నాతో నుండును
చల్లని నీడలలోన జల్టరు తావులలోన
నా యేసుపై ఆనుకొని / నే సాగిపోయెదను
2•
శోధన వేదనలోన గాలితుఫానులలోన
నా యేసు నా నావలోన చాలును నిదురించిన
సాగర కెరటాలైన / సాతాను పోరాటమైన
నాయేసునే ఆనుకొని / హాయిగ పయనించను
3•
గుడార యానములోన / నా జీవిత యాత్రలోన
అరణ్య దారులలోన / నా జీవిత నావలోన
గిరులు తరులే ఒరిగిన / పర్వతాలే తొలగిన
అభయము నిచ్చినవాడు మారడు నా యేసుడు