ఏమి లేమి లేదు మాకు యెహోవా మా కాపరి

ఏమి లేమి లేదు మాకు యెహోవా మా కాపరి

ఏమి లేమి లేదు మాకు యెహోవా మా కాపరి
బ్రతుకంతా నుతియింతుము ప్రభుని గాన లాహరి

1.
దారితెన్ను కానరాని జనగణాలలో
చిక్కియున్న మమ్ముచూచి చేరదీస్తివి ॥2॥
సకల జనులకు నీదు వాక్యము చాటింప ॥2॥
కృపావరముతో మమ్ము బలపరచితివి ॥2॥
                                           ||ఏమి లేమి||

2.
మంచి ఎంచి నడవలేని లోకమందున
వంచకులై సంచరించు జనుల మధ్యకు ॥2॥
ప్రభుయేసు సత్యమును ఇలలో ప్రకటించుటకు ॥2॥
దేవుని మహిమ పరుచుటకై పిలవబడితిమి ॥2॥
                                           ॥ఏమి లేమీ॥

3.
పరిశుద్ధులుగా పరిమళించాలని
ఎంచి వాక్యముతో ఉదకస్నానం చేయించితివి ॥2॥
బోధకులై సువార్తను ప్రచురించాలని ॥2॥
నీ పరిచర్య కొరకు మేము పిలువబడితిమి ॥2॥
                                           ||ఏమి లేమీ॥

4.
కృతజ్ఞతా హృదయముతో పులకరించుచూ
తండ్రి కుమారాత్మలను స్తుతియించుచూ
సార్వత్రిక సంఘముగ వర్ధిల్లుచూ
దేవుని మహిమ పరుచుటకు పిలువబడితిమి
                                            ॥ఏమి లేమీ॥

Leave a Comment