యెహోవా నాకు వెలుగయ్యె యెహోవా నాకు రక్షణయ్యె
యెహోవా నాకు వెలుగయ్యె
యెహోవా నాకు రక్షణయ్యె
నా ప్రాణ దుర్గమయ్యె
నేను ఎనరికి ఎన్నడు భయపడను
1.
నా తల్లియు, నా తండ్రియు /
ఒక వేళ విడిచినను
ఆపత్కాలమందు చేయి విడువకను
యెహోవా నన్ను చేరదీయును (2)
2.
నా కొండయు, నా కోటయు, /
నా ఆశ్రయము నీవే
నే నెల్లవుడు ప్రభు సన్నిధిలో
స్తుతిగానము చేసెదను (2)
3.
నాకు మార్గమును, ఉపదేశమును /
ఆలోచన అనుగ్రహించె
నీ అజ్ఞలలో జీవించుటకు /
కృపతో నిండి కాపాడుము