ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టిన రోజు

ఏ పాట పాడేను యేసయ్యా నీ పుట్టిన రోజు

ఏ పాట పాడేను యేసయ్యా
నీ పుట్టిన రోజు తలచుకొని
ఏమాట పలికేను యేసయ్యా
నీ పుట్టుక కష్టము తెలుసుకొని
గుండెలో దుఃఖం నిండి పోగా
గుండె గొంతుక పెనుగులాడగ

1•
కన్య మరియ గర్భవతియై /
దీనురాలై ధన్యురాలై
సంకెళ్ళ కన్నీళ్ళ కట్టడలో /
లోకరక్షకుని కన్నతల్లియై
పాడేన ఈ జోలపాట /
క్రిస్మస్లో ఆ సిలువపాట

2•
పశువుల పాకే పాపిష్టి – లోకమై /
గొంగలి దుప్పటి పాపపు ముసుగై
పశువుల తొట్టె మోసమైన మనసై
పాతబట్టలే మరణ పాశములై పాడేన
ఈ జోలపాట / క్రిస్మస్లో కల్వరిపాట

Leave a Comment