విన్నపాలు వినుదైవమా నా కన్నీరు తుడుచు దైవమా

విన్నపాలు వినుదైవమా నా కన్నీరు తుడుచు దైవమా

విన్నపాలు వినుదైవమా /
నా కన్నీరు తుడుచు దైవమా
స్వస్థత నిచ్చుదైవమా / స్తోత్రము యేసయ్య

1.
నీకు సాధ్యమే సర్వం సాధ్యమే /
ఒక మాట పలికినచాలు
దేవా ఒక మాట పలికిన చాలు ॥విన్నపాలు॥

2.
కనికరించి నీ చేయిచాపి /
అద్భుతం చేయు దైవమా
దేవా అద్భుతం చేయు దైవమా ॥విన్నపాలు॥

3.
నా కిష్టమే శుద్ధుడవు కమ్ము /
అని పలికి రక్షించితివే
దేవా అని పలికి రక్షించితివే ॥విన్నపాలు॥

4.
నా వ్యాధులు సిలువపైన /
నీవు మోసి తీర్చావయ్యా
దేవా నీవు మోసి తీర్చావయ్యా ॥విన్నపాలు॥

5.
అంధులకు దృష్టినిచ్చితివి /
కుంటి వారిని నడిపించితివి
దేవా కుంటి వారిని నడిపించితివి ॥విన్నపాలు॥

Leave a Comment