వినరే యో నరులారా వీనులకింపు మీర

వినరే యో నరులారా వీనులకింపు మీర

వినరే యో నరులారా/ వీనులకింపు మీర
మనల రక్షింప క్రీస్తు /
మనుజావతారుడయ్యె వినరే
అనుదినమును దేవుని తనయుని పద
వనజంబులు / మనమున నిడికొనుచును ॥ వినరే ॥

1•
నరరూపు బూని ఘోర – నరకులా రారమ్మని
దురితము బాపుదొడ్డ దొరయౌ
మరియా వరపుత్రుడు-కరమరుదగు
కల్వరి గిరిదరి కరిగిరయంబున –
ప్రభు కరుణను గనరే ॥ వినరే ॥

2•
ఆనందమైన మోక్షమందరికియ్య దీక్ష/
బూని తన మేని సిలువ/
మ్రాను నణచి మృతిబొందెను
దీనదయాపరుడైన మహాత్ముడు
జానుగయాగము సలిపిన తెరంగిది ॥ వినరే ॥

3•
పొందుగోరిన వారి విందా పరమోపకారి
యెందరెందరి బరమా /
నంద పదమొందగ జేసెను
అందమునన్ దన / బొంది సురక్తము
జిందెను భక్తుల / డెందము గుందగ ॥ వినరే ॥

4•
ఇలమాయావాదుల మాని /
యితడే సద్గురుడని
తలపోసి చూచి మతి నిశ్చల భక్తిని /
గొలచిన వారికి / నిల జనులకు గలు
ముల నలరెడు ధనికుల కందని /
సుఖములు మరి యొసగును ॥ వినరే ॥

5•
దురితము లణపవచ్చి /
మరణమై తిరిగి లేచి
నిరత మోక్షానంద సుం /
దర మందిరమున
కరుదుగ జనే బిరబిర /
మన మందర మా కరుణా శరనిది /
చరణమే శరణని పోదము ॥ వినరే ॥


రచన: పురుషోత్తం చౌదరి

 

Leave a Comment