విడుదలకు నాయకుడు విజయమునిచ్చును
విడుదలకు నాయకుడు / విజయమునిచ్చును
నాలో ఉన్నాడు / ఎంతో ఆనందం
1•
నేను పాటపాడి హర్షింతున్ /
దినం నాట్యం ఆడిస్తుతింతున్
నేను పరుగులెత్తి చాటెదన్ /
నా యేసు సజీవుడని ॥విడుదల॥
2•
ప్రభు నన్ను వెదకి వచ్చి /
కౌగిలించి ఆదరించెన్
నా పాపములనుక్ష మించి /
క్రొత్త మనిషిగా మార్చెను ॥విడుదల॥
3•
ప్రభు ప్రేమ అభిషేకము /
నన్నునుదినము నింపినడుపును
సాతాను బలము జయించ /
అధికారం నాకు యిచ్చెను ॥విడుదల॥
4•
సముద్రము దాటి వెళ్ళుదున్ /
యెర్ధాను త్రొక్కినడుతున్
యెరికోను చుట్టి వచ్చెదను /
నేను బూరఊది జయింతున్ ॥విడుదల॥