వెళ్ళెదం శ్రేష్టదేశం నిజము ఉండెదం ప్రభుతో

వెళ్ళెదం శ్రేష్టదేశం నిజము ఉండెదం ప్రభుతో

వెళ్ళెదం శ్రేష్టదేశం నిజము
ఉండెదం ప్రభుతో నే నిత్యము
పరలోక దేశము ఉత్తమం /
మనదేశం అతి ఉత్తమం

1•
తండ్రి కోరికయే మనకొక రాజ్యమివ్వ
లోకసృష్టి క్రితము యేర్పాటైన పట్టణం

2•
అద్భుత నగరమది ప్రభు నిర్మించినది
దృఢమై న పునాది స్థిరపరచబడినది

3•
పవిత్ర నగరమది / నీతికి స్తానమది
పరమ స్వభావముతో నిర్మించబడినది

4•
నిరంతర రాజ్యమది / యుగంబు లుండునది
నిత్య ముండెదరచ్చట / ఏర్పరచబడినవారు

5•
ప్రభుని చూచెదము / అనంద మొందెదము
ప్రభుతో సమానముగా / మనముండెద మచ్చట

Leave a Comment