వెలిగింది గగనం ఒక వింత తారతో

వెలిగింది గగనం ఒక వింత తారతో

వెలిగింది గగనం/ఒక వింత తారతో
మురిసింది భువనం/ప్రభు యేసురాకతో
పులకించె ప్రకృతి/పలికించె ప్రస్తుతి
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్/మెర్రీ మెర్రీ క్రిస్మస్

1•
రాజుల రాజు ప్రభువుల ప్రభువు /
భువికేతెంచెనని భూజనులకు బహుమానముగా
ఇలలో జనియించెనని /
పరమోన్నతుని ప్రసన్నత /
ఈ జగతిలో నిండెనని /
వరసుతుడేసుని నవ్వుతో /
పశువుల పాకయె పండెనని

2•
దీనులగాచే దైవకుమారుడు /
పరమును వీడెనని
మనుష్యకుమారుడై కన్య మరియ ఒడిలో /
పరుండెనని
పాపాల బ్రోచే రక్షకుడు/యేసయ్యగ వచ్చెనని
కాపుదలిచ్చే ఇమ్మానుయేలు/
వెలుగును తెచ్చెనని


రచన : బ్ర. ఎ. ఆర్. స్టీవెన్సన్

Leave a Comment