తూర్పుదిక్కు చుక్కబుట్టె మేరమ్మా
తూర్పుదిక్కు చుక్కబుట్టె మేరమ్మా /
ఓ మరియమ్మ
చుక్కన్ చూసి మేము వచ్చినాము /
మ్రొక్కి పోవుటకు – 2
1•
పశువుల పాకలోన బాలుడమ్మా /
పాపరహితుడమ్మా…
పాపములన్ని పారద్రోలునమ్మా /
సత్యవంతుడమ్మా – 2 ||తూర్పు||
2•
యెరూషలేము పురముజేర వచ్చినాము/
హేరోదు నొద్దకు
ఎక్కడ ఉన్నాడని అడిగినాము/
మనవి చేసినాము – 2 ||తూర్పు||
3•
బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినాము/
బాల యేసునొద్దకు
బంగారు పాదములు మ్రొక్కెదము/
బాగు పడెదము – 2 ||తూర్పు||