తయ్యక తద్దిమి ఆడరా చెల్ యేసు రాజట నడురో
తయ్యక తద్దిమి ఆడరా చెల్ /
యేసు రాజట నడురో
బీదల రాజట వినరో /
చెంగు చెంగున దూకరా చెల్ ||తయ్యక||
1•
ఆశ్చర్యకరుడట /అడుగులో అడుగెయ్యరా
ఆలోచనకర్తట / వడివడిగా నడువరా
పూజించి వద్దాము రారో/
మంచి గొర్రెపిల్లను తేరో /
బీదల రాజట వినరో/
చెంగుచెంగున దూకరా, చెల్ -2 ||తయ్యక||
2•
బలవంతుడు అతడట /
భళి భళి ఇది లేరా నిత్యుడగు తండ్రట/
నిత్యము స్తుతియించరా /
పూజించి వద్దాము రారో/
మంచి గొర్రె పిల్లను తేరో /
బీదల రాజట వినరో
చెంగుచెంగున దూకరా, చెల్ -2 ॥తయ్యక॥
రచన: బ్ర. యం. టైటస్ దేవదాస్