స్తుతి చెల్లించుచున్నాము మా నిండు హృదయాలతో
స్తుతి చెల్లించుచున్నాము
మా నిండు హృదయాలతో (2)
యేసు నీవే / నీవే మా ప్రభువు (2)
మహిమా నీకే / మహిమా నీకే (2)
1.
ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధింతుము (2)
ఎంతో ఇంకా ఎంతో నీ నామమున్ ఘనపరతున్
॥మహిమా॥
2.
ఆత్మతో నింపు ప్రభూ నీయందు ఆనందింతున్
ఎంతో ఇంకా ఎంతో నిన్ను నేను స్తుతించెదన్
॥మహిమా॥