శ్రేష్ఠనామం అతి శ్రేష్ఠనామం శ్రీ యేసునామము
శ్రేష్ఠనామం – అతి శ్రేష్ఠనామం /
శ్రీ యేసునామము
త్రియేక దేవుని ప్రియమైన నామం /
ప్రభు యేసునామము
అ.ప:
ఇమ్మాను యేలుగా
ఇలకేతెంచిన పరిశుద్ధనామము
నా…. యేసు ఆశ్చర్యకరుడు
నా…. యేసు ఆలోచనకర్త
బలవంతుడు – నిత్యుడు తండ్రి
సమాధానకర్తనే కీర్తింతును ॥2॥
1•
ఉన్న వాడవు అనువాడవు /
యుగములన్నిట రాజువు
భూతవర్తమాన భవిష్యత్తులో /
స్తుతులకు అర్హుడవు ॥2॥ ॥నా యేసు॥
2•
దుర్గమయిన ప్రభునామము –
దుష్టుని బాణము విరచును
దూతలకు ఆజ్ఞాపించును /
నీతిమంతుల దాచును ॥2॥ ॥నా యేసు॥
3.
ఇహపరములలో పై నామము –
మహిమ ప్రభావము పొందెను
ప్రభు యేసు క్రీస్తు అను నామము –
ప్రజలందరికి పూజ్యము ॥2॥ ॥నా యేసు॥