శ్రీయేసుని జన్మదినము ప్రజలందరికి పర్వదినము

శ్రీయేసుని జన్మదినము ప్రజలందరికి పర్వదినము

శ్రీయేసుని జన్మదినము/
ప్రజలందరికి పర్వదినము
సంతోషమే సమాధానమే /
సద్భక్తులందరికి సదానందమే

1•
దేవాది దేవుని ప్రేమకానుకా /
ఏకైక పుత్రుడు ప్రేమస్వరూపా
మానవాళిని రక్షింప పంపెను /
ఆనందంతో అంగీకరింపగా ||శ్రీయేసు||

2.
ఇమ్మానుయేలు మనకు అండగా /
చింతేమి లేదిక యేసు ఉండగా
క్రీస్తే సర్వము అధిపతియు /
పాటలు పాడుచు కొనియాడెదము||శ్రీయేసు||


రచన: సహో॥ రేచల్ జ్యోతి కొమానపల్లి

Leave a Comment