సర్వజనులారా సన్నుతించరండి
సర్వజనులారా సన్నుతించరండి
హల్లెలూయ పాటలు పాడండి
సీయోను పాటలు పాడండి /
సంతోషగానం చేయండి
1.
సాటిలేని యేసునాధునికే /
సంతోష గానం చేయండి ఆశ్చర్య కార్యములు /
మనకు చేసిన వాని చూడ రారండి
పిన్న పెద్దలారా / సర్వలోక వాసులారా
హల్లెలూయ పాటలు పాడండి ||సర్వ||
2.
ఉత్సహించు పెదవులతో /
హోసన్నా పాటలు పాడండి
క్రొత్త గీతి నోటనుంచిన /
ఆ యేసు నాధుని స్తుతియించుడి
లెక్కింపలేని సైన్యములారా /
హల్లెలూయ పాటలు పాడండి ||సర్వ||
3.
స్వరమండలములతో చక్కని గళములతో
తంబుర నాట్యముతో తంతి వాయిద్యములతో
సకల ప్రాణులు / ప్రభుని స్తుతించుడి
హల్లెలూయ పాటలు పాడండి ||సర్వ||