రుచిగల యేసుని భుజియింతమా రారాజు యేసుని
రుచిగల యేసుని – భుజియింతమా
రారాజు యేసుని – పూజింతమా
రక్షించు యేసుని – స్తుతియింతమా
వేవేల జనమా – వేగిరి పడుమా ॥రుచి॥
1•
బరువైన – మన పాపం
భరించలేని – మహా ఘోరం
సారమైన – సిలువ రుధిరం
ఈనాడే – క్షమించును ॥రుచి॥
2•
మతము కాదు – ప్రభువు మార్గం
కులము కాదిది- నిజ మార్గం
ధనముతో కొనలేని – మోక్షము
ఈనాడే – దయ చేయును ॥రుచి॥
3•
వెదకిన యేసుని – వెంబడించుమా
పిలిచిన ప్రభుని – పలుకరించుమా
మెల్లని స్వరము – వినగోరుమా
ఈనాడే – మహా దినం ॥రుచి॥