రాత్రినేడు రక్షకుండు తెలిసి వింతగా
రాత్రినేడు రక్షకుండు/తెలిసి వింతగా
నేడెంతో మోదమొందగా /
ఈ పాపి రక్షణార్థమై
1•
లోకపాపమెల్ల తాను శిరస్సు మోసేను
లోకనాథుడై మరియు అవతరించెను –
ఈ తండే దేవుడాయెను ॥రాత్రి నేడు॥
2•
బేత్లహేము గ్రామమెంతో పుణ్యగ్రామము
యేసురాజు కేసి పెట్టె పశులకొట్టము
మేరమ్మ జోలపాడగా జగాలు పరవసించెగా
॥రాత్రి నేడు॥
3•
ఆకాశాన తార ఒకటి బయలు దేరెను
తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను
చిన్నారి యేసుబాబును /
కళ్లార చూసి మురిసెను ॥రాత్రి నేడు॥
4•
పొలములోని గొల్లవారి కనుల ముందుగా
గబ్రియేలు దూత తెచ్చె వార్త ముందుగా
ఈ నాడే మనకు పండుగ రారండి ఆడిపాడగా
॥రాత్రి నేడు॥
5•
లోకములో క్రీస్తు ప్రభుని సాగి మ్రొక్కెదము
భూమి అంతములో క్రీస్తు పేరు నిలుచును
ఈ తండ్రీ దేవుడాయెను ॥రాత్రి నేడు॥