రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేయుదము

రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానము చేయుదము

రండి యెహోవాను గూర్చి
ఉత్సాహ గానము చేయుదము
ఆయనే మన పోషకుడు/నమ్మదగిన దేవుడని

1•
కష్టనష్టములెన్నున్న/
పొంగుసాగరాలెదురైనా
ఆయనే మన ఆశ్రయం/ఇరుకులో ఇబ్బందులలో
ఆహా హల్లెలూయ (2)

2•
విరిగి నలిగిన హృదయముతో /
దేవదేవుని సన్నిధిలో
ఆనిశము ప్రార్థించిన/కలుగు ఈవులు మనకెన్నో
ఆహా హల్లెలూయ (2)

3•
త్రోవ తప్పిన వారలను/
చేరదీసేనాధుడని
నీతి సూర్యుండాయనేయని /నిత్యమూ స్తుతి చేయుదము
ఆహా హల్లెలూయ (2)

Leave a Comment