రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి
రండి స్తుతించుచు పాడుడి /
రారాజు యేసుని చేరుడి (2)
హల్లెలూయ / హల్లెలూయ –
హల్లెలూయ / హల్లెలూయ
హల్లెలూయ / హల్లెలూయ
ఆమెన్ / ఆమెన్ / ఆమెన్ / ఆమెన్
1.
శ్రీ యేసు కాంతిలో నిలచి/
సాగించు జీవితయాత్ర
బాధలనన్నిటిని బాపున్ /
భజియించు యేసుని నామము ॥హల్లె॥
2.
విలువైన నీ జీవితమున్ /
వెలిగించుము ప్రభు కొరకు
పరిశుద్ధాత్మను పొంది /
ప్రభు వాక్యము ప్రకటించు ॥హల్లె॥
3.
మరణము జయించి లేచెన్ /
మరణపు ముల్లును విరిచెన్
మధురము యేసుని నామం /
మరువకు యేసుని ధ్యానం ॥హల్లె॥