రాజులకు రాజు బుట్టెనన్నయ్య
రాజులకు రాజు బుట్టెనన్నయ్య /
రారెచూడ మన మెల్లు దామన్నయ్యా
1•
యూదయ్యనే దేశమందన్నయ్య /
యూదులకు గొప్ప రాజు బుట్టెనయ్యా
2•
పశువుల పాకలో నన్నయ్య /
శిశువు బుట్టె నేడు చూడరండన్నయ్యా
3•
తారన్ జూచి-తూర్పు జ్ఞానులన్నయ్య /
తరలినారే వారు బెత్లహేమన్నయ్యా
4•
బంగారము-సాంబ్రాణి-బోళమన్నయ్య /
బాగుగనే-శ్రీయేసుకిచ్చి రన్నయ్య
5•
పొందుగను లోకమందన్నయ్య /
సుందరుడు శ్రీ యేసు పుట్టెనన్నయ్య
6•
ఆడుదమా పాడుదామన్నయ్య /
కూడియేసున్ మనమేడుదామన్నయ్య