పుట్టినాడు నాడు ఓ గొప్పరాజు వీరుడై

పుట్టినాడు నాడు ఓ గొప్పరాజు వీరుడై

పుట్టినాడు నాడు/ఓ గొప్పరాజు
వీరుడై, ధీరుడై-యేసయ్య/పుట్టాలి నేడు
నీ గుండెలోనా దేవుడై, ప్రభువై / యేసయ్య
పరిశుద్ధ దేవుడే / పసి బాలుడాయెనే

1•
పుట్టెడంత పాపాలు /
కడిగివేయు కరుణామయుడు
పుట్టెనండి పాకలో పసిబాలుడై
ప్రభువు గొల్లలమై వెళ్ళి మొక్కి వద్దామా
బోసినవ్వు మూటగట్టు కుందా మా
పసిబాలుడాయెనే / ప్రభువైన దేవుడు ||పుట్టి||

2•
హద్దులేని ఆవేదనలు అణచివేయు/
ఆశ్చర్యకరుడు
పండినాడు కుడితితొట్టిలో పసిబాలుడై /
ప్రభువు
జ్ఞానుల్లాగ వెళ్ళి పూజ చేద్దామా
బ్రతుకంతా కానుకై పోదామా
దీనాత్ముడాయెనే ప్రభువైన దేవుడు ||పుట్టి||

రచన : గుంటూరు రాజా

Leave a Comment