ప్రేమ రాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు

ప్రేమ రాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు

ప్రేమ రాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు
ప్రియమైన తన పెళ్లిసంఘమును
తీసుకు పోతాడు
గగనములోన / మేఘాలపైన (2) త్వరగా వస్తాడు

1•
ఇద్దరు తిరుగలి – విసురు చుండగా
పొలములో ఇద్దరు – పని చేస్తుండగా
ఒకరు ఎత్తబడి – ఒకరు విడువబడి
రెప్ప పాటులో కొనిపోబడుదుము ॥ప్రేమ॥

2•
చంద్రుని అంత అందము కలిగి
సూర్యని అంత – కాంతిని కలిగి
తూర్పున పుట్టి – పడమట మెరిసే
మెరుపులాగనే వస్తాడు ॥ప్రేమ॥

3•
సిద్ధంగుండని ప్రభువు చెప్పగా
తన ప్రియ సంఘము దీవెన నొందగ
వధువు నిరీక్షణ – ప్రభు పిలువగా
పరమ విందుకు కొనిపో బడుదుము ॥ప్రేమ॥

Leave a Comment