పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ

పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ

పరమ జీవము నాకు నివ్వ /
తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నడిపించును /
మరల వచ్చి యేసు కొనిపోవును
యేసు చాలును – యేసు చాలును
యేసమయమైన యేస్థితికైన
నాజీవితములో / యేసు చాలును

1•
సాతాను శోధన అధికమైన /
సొమ్మ సిల్లక సాగివెళ్ళెదను
లోకము శరీరము లాగినను /
లోబడక నేను వెళ్ళెదను ॥యేసు॥

2.
పచ్చిక బయలులో పరుండ జేయున్
శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము / తృప్తిపరచున్
మరణ లోయలో / నన్ను కాపాడును ॥యేసు॥

3.
నరులెల్లరు నన్ను విడిచినను /
శరీరము కుళ్ళికృశించినను
హరించినన్ నాఐశ్వర్యము /
విరోధి వలె నన్ను విడిచినను ॥యేసు॥

Leave a Comment