పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్

పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్

పాడెద దేవా – నీ కృపలన్ నూతన గీతములన్

స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్

1•
భూమి పునాదులు వేయకముందే /
యేసులో జూచితివి
ప్రేమ పునాదుల వేసితివి / దీనుని బ్రోచితివి

ఈ దీనుని బ్రోచితివి ॥పాడెద॥

2•
ప్రవిమల రక్తము కలువరి సిలువలో /
ఖలునకు నిచ్చితివి
ప్రేమ కృపా మహాదై శ్వర్యములతో /
పాపము తుడిచితివి
నా పాపము తుడిచితివి ॥పాడెద॥

3•
పాపము శాపము నరకపు వేదన /
మరి తొలగించితివి
అపరాధములచే చచ్చిన నన్ను /
ధర బ్రతికించితివి / నను బ్రతికించితివి

॥పాడెద॥

4•
దేవుని రాజ్యపు వారసుడనుగా /
క్రీస్తులో జేసితివి
చీకటి రాజ్యపు శక్తులనుండి /

నను విడిపించితివి చెర విడిపించితివి

॥పాడెద॥

5•
ముద్రించితివి శుద్ధాత్మతో నను /
భద్రము చేసితివి
సత్య స్వరూపి నిత్య నివాసి /

సొత్తుగా జేసితివి నీ సొత్తుగజేసితివి ॥పాడెద॥

Leave a Comment