న్యాయాధిపతియైన దేవుడు నిను తీర్పు తీర్చేటి వేళలో

న్యాయాధిపతియైన దేవుడు నిను తీర్పు తీర్చేటి వేళలో

న్యాయాధిపతియైన దేవుడు /
నిను తీర్పు తీర్చేటి వేళలో
ఏ గుంపులో నీ వుందువో /
యోచించుకో ఓ క్రైస్తవా
ఏ గుంపులోనీ వుందువో /
యోచించుకో ఓ మానవా ?

1•
ఆకలితో వేదనొందగా / దాహంతో తపియించగా
రోగముతో కృషియించగా (2)
నను చేర్చుకొనలేదు నీ వెందుకో
ఆని యేసు నిన్నడిగిన ఏమందువు ॥న్యాయాధి॥

2•
గొర్రెలనే నీతిమంతులు
మేకలనే పాపాత్ములు మందలుగా విభజించగా /
ఏ వైపున నీవు నిలుచుందువో
అని యేను నిన్నడిగిన ఏమందువు ||న్యాయాధి||

3•
గొర్రెలకు నిత్యజీవము / మేకలకు నిత్య నరకము
ప్రతిఫలము నొసగునుగా (2)
ఆ రెంటిలో నీది ఏ స్థానమో
అని యేసు నిన్నడిగిన ఏమందువు॥న్యాయాధి||

4•
గ్రహించుకో నీదు గమ్యము /
విడనాడు పాప గతమును
లేదింక నీకుతరుణము /
ప్రభునా శ్రయించుటే బహుక్షేమము /
ప్రభున్ జేర్చుకో సరిదిద్దుకో ॥న్యాయాధి॥

Leave a Comment