నీతో పోల్చుటకు సర్వేశా ఎవరును లేరు ప్రకాశా

నీతో పోల్చుటకు సర్వేశా ఎవరును లేరు ప్రకాశా

నీతో పోల్చుటకు సర్వేశా /
ఎవరును లేరు ప్రకాశా

అ. ప:
స్తుతి పాడుటకు – యేసునాధా చాలవు
పదివేల నాలుకలు

1•
నిజముగ యేసు / పరిశుద్ధుడు
పరమ దేవుని / చూచుటకు
స్తుతులతోను / ఆరాధనతో
దేవ దేవుని / చేరెదము ॥నీతో॥

2•
చేతిపటములు / రాళ్ళుమన్ను
మనకు దైవము / కానేరవు
ఆత్మతోను / సత్యముతో
ఆరాధింతుము / మన దేవుని ॥నీతో॥

3•
నశించును / వెండిబంగారము
లోకమాయలు / గతించును
విలువైనది / స్థిరమైనది
యేసునాధుని / కృపావరమే ॥నీతో॥

4•
దైవసుతుడుగ / అవతరించెన్
పాపశోధనలు / తొలగించన్
నరులకై / జీవమిచ్చెన్
నశించు జనులను / రక్షించను ॥నీతో॥

5•
పొంగుచుండిన / అలలమ
త్రొక్కునటువంటి / ప్రభువు
అణగిపోవున్ / గద్దించగనే
అద్దరి మనము / చేరుటకు ॥నీతో॥

6•
జీవమిచ్చి లేచెను / ప్రభువు
జీవదేవుడు / విజయుడయ్యెన్
యేసుప్రభువు / తిరిగి వచ్చున్
సమీపించునా / శుభదినము ॥నీతో॥

Leave a Comment