నీ సమాధానము దాసుని కిప్పుడు
నీ సమాధానము /దాసుని కిప్పుడు
నాధా దేవా యిచ్చి / నీ = మాటచొప్పున /
పోనిచ్చుచున్నావు /
నాధా దేవా ॥నీ సమాధానము॥
1•
అన్యులకు నిన్ను / బయలు పరచెడి/
వెలుగుఁగాను =నీకు / నణఁగు ప్రజలైన/
యిశ్రాయేల్ వారికి /
మహిమ గాను ॥నీ సమాధానము॥
2•
నరులకై నీవు ఏ/ర్పరచిన రక్షణన్ /
నాధా దేవా యిదిగో /నాకనులు చూచి యా/
నందించుచున్నవి /
నాధా దేవా ||నీ సమాధానము॥
3•
తండ్రికి సుతునికిఁ బరిశుద్ధాత్మకును /
గలుగుగాక = మహిమ/తరుగక సదాకాలము/
యుగయుగములకును/
గలుగు నామేన్ ॥నీ సమాధానము॥
సమూయేలు పాక్యనాధము