నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా
నీ జీవితములో గమ్యంబు
ఏదో ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభుయేసు కొరకు
నీహృదయ మర్పింపవా
1•
నీ తల్లి గర్భమున నుండి నపుడె /
నిను చూచె ప్రభుకన్నులు
యోచించినావా ఏరీతి నిన్ను నిర్మించె
తన హస్తముల్ ॥నీ॥
2•
నీలోన తాను నివసింపగోరి
దినమెల్ల చేజాచెను
హృదయంపు తలుపు తెరువంగలేవా
యేసు ప్రవేశింపను ॥నీ॥
3•
తన చేతులందు రుధిరంపు ధారల్
స్రవియించె నీ కోసమే
భరియించె శిక్ష నీకోసమేగా
ఒకసారి గమనించవా ॥నీ॥
4•
ప్రభుయేసు నిన్ను సంధించు నట్టి
సమయంబు ఈనాడేగా
ఈ చోటనుండి ప్రభుయేసు లేక
పోబోకుమో సోదరా ॥నీ॥