నన్ను నడిపే యేసయ్యా నన్ను కాచే మెస్సయ్యా
నన్ను నడిపే యేసయ్యా
నన్ను కాచే మెస్సయ్యా
నీకే స్తోత్రముల్ – 4
1•
పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై
నా గుడారముపై నిలిచిన
నాదు దైవమా ॥నన్ను॥
2•
కునుకడు నిదురపోడు
కుడిప్రక్కనే ఉండు దేవుడు
తన రెక్కలపై నన్ను మోయును
కనురెప్పవలె నన్ను కాయును ॥నన్ను॥