నా యేసు రాజునకే ఎల్లప్పుడు స్తోత్రము

నా యేసు రాజునకే ఎల్లప్పుడు స్తోత్రము
నాతో జీవించువానికి/ఎప్పుడు స్తోత్రము ॥నా॥

1•
ప్రభువా నీవు చేసిన మేలులను /
నిత్యము తలంతును నిండు మనస్సుతో
నీ నామము పాడి పొగడెదన్ – నేను ॥నా॥

2•
పాపములన్నియు మన్నించిరి /
వ్యాధుల స్వస్థపరచి నా జీవమును /
నాశనమునుండి కాచి రక్షించితివి …ఆ …ఆ ॥నా॥

3•
నలుగగొట్టబడి త్రోయబడి /
ప్రియుడా నీవు ఆదుకొని
చేయి విడువబడి మొరపెట్టగా
ప్రభువా నీవు ఆదరించితివి ॥నా॥

4•
ఇక నేను బ్రతుకుట నీ కొరకే /
నీ యొక్క మహిమ కొరకే
నీ ప్రేమను యెత్తి చెప్పుదును /
ఎడతెగకుండా పాడుదున్ … ॥నా॥

Leave a Comment