నా నోటన్ క్రొత్త పాట నా యేసు యుంచెను
నా నోటన్ క్రొత్త పాట / నా యేసు యుంచెను
ఆనందించెదను / ఆయన నేపాడెదన్
జీవిత కాల మంత / హల్లెలూయ
1•
పాపబురద నుండి / లేవనెత్తెను
జీవ మార్గమున నన్ను / నిలువ బెట్టెను॥ఆనం॥
2•
వ్యాధి బాధ లందు నన్ను / ఆదుకొనేను
కష్టము లన్ని తొలగించి / శుద్దీకరించెను॥ఆనం॥
3•
తల్లి తండ్రి బంధు మిత్రు / దూర మాయెనే
నిందను భరించి ఆయన / మహిమ చాటెదన్
4•
ఇహలోక శ్రమలు / నన్నేమి చేయును
పరలోక జీవితమునే / వాంచించెదను ॥ఆనం॥