ముసి ముసి నవ్వుల క్రిస్మస్ తాత

ముసి ముసి నవ్వుల క్రిస్మస్ తాత

ముసి నవ్వుల క్రిస్మస్ తాత
కలలో కనబడి నన్నడిగాడు
పండుగ సందడి ఎలా ఉందని
ఇంట్లో అందరు ఏం చేస్తున్నారని

1•
ఏం చెప్పను మమ్మీ సంగతి
మార్నింగ్ నుండి ఒకటే గోల
కొత్త సారికి మ్యాచింగ్ లేదట
మ్యాచింగ్ లేకుంటే చర్చికి రాదట
॥ముసి ముసి॥

2•
పండుగ బట్టలు పొడుగయ్యాయని
వేసుకునేందుకు పనికి రాదని
అన్నయ్యేమో మూఢబోయి
అందుకు తాను చర్చికి రాడట
॥ముసి ముసి॥

3•
పండుగ పూట మాంసం కూర
వండకపోతే పండుగ కాదట
అన్ని పనులు ముగించి డాడి
ఆఖరి ప్రార్థన కొస్తాడంట
॥ముసి ముసి॥

Leave a Comment