మేము భయపడము ఇక మేము భయపడము
మేము భయపడము ఇక మేము భయపడము
ఏ కీడు రాదని / యేసే చెప్పెను మాకు
1•
దైవ బ్రష్టులమైన మమ్ము / దివ్యంపుగా రక్షించె
దివారాత్రులు / దేవుడే కాయును ॥మేము॥
2•
శత్రుకోటి మమ్ము చుట్టన్ /
పాతాళము మ్రింగ జూడన్
నిత్యుడు యేసు / నిత్యము కాయును॥మేము॥
3•
అగ్ని పరీక్షల యందు / వాగ్దాన మిచ్చె
మాతోనుండ ఏ ఘడియైనను /
విడువక కాయును ॥మేము॥
4•
బలమైన ప్రభు హస్తములు /
వలయమువలె మమ్ము జుట్టి
పలు విధములగా / కాపాడు మమ్ము ॥మేము॥
5•
కునుకడు మన దేవుడు /
యెన్నడు నిద్రించడు
కను పాపగ మమ్ము /
కాపాడు నెప్పుడు ॥మేము॥
6•
జీవిత కష్టనష్టములు / ఆవరించి దుఃఖ పర్చ
దేవుడొసంగిన / ఈవుల నెంచుచు ॥మేము॥
7•
ఇహ మందు మన శ్రమలన్నీ /
మహినుకు మార్చెడు ప్రభున్
మహిమ పరచి / మ్రొక్కెద మిలలో ॥మేము॥