మహిమ మహిమ ప్రభుకే మహిమ

మహిమ మహిమ ప్రభుకే మహిమ

మహిమ మహిమ ప్రభుకే మహిమ
మహిమ మహిమ ప్రభుకే మహిమ
మా కెన్నడు వలదు సుమా /
ఇహలోక మందు పరలోకమందు
ప్రభు యేసునకే మహిమ

పల్లవి :
ఆ…. అనందమే పరమానందమే
అది మాకు ఆశీర్వాదమే
ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను
అంత దీనులమై యుందుము

1.
కొండలను పెకలించెడు /
విశ్వాసం కలిగి జీవించిననూ
అద్భుతంబగు ఆయన కృప లేనిదే /
నా విశ్వాసం వ్యర్థమేగా ॥ఆ॥

2.
ఎంత తీవ్రతతో ప్రార్థించినను /
సేవకెంత ధనం బిచ్చిన
ఎంత ఆత్మశక్తితో ప్రసంగించినను /
అంత అణకువతో యుందుము ॥ఆ॥

3.
కృపావరములెన్నెన్నో కలిగి యున్న /
ఎన్ని మర్మము లెరిగినను
ఎంత మాధుర్యముగ పాడగల్గినను /
వినయము లేనిదే వ్యర్థము ॥ఆ॥

4.
ఎన్నో ఆధిక్యలతో కూడిన
ఈ గొప్ప సేవను మనకిచ్చెను
తగ్గించు కొందుమా నిలిచి యుందుము
అంతం వరకు ఈ గొప్ప సేవలో ॥ఆ॥

5.
కృప చేతనే రక్షింపబడితిమి /
కృపవల్లనన్ని పొందితిమి
కృపయందే చలించుచున్నాము
మనం కృపగల ప్రభుకే మహిమ ॥ఆ॥

Leave a Comment