లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు
లెక్కించలేని స్తోత్రముల్ /
దేవా ఎల్లప్పుడు నేపాడెదన్
ఇంతవరకు నా బ్రతుకులో /
నీవు చేసిన మేళ్ళకై (2)
1•
ఆకాశ మహాకాశముల్ /
దాని క్రిందున్న ఆకాశము
భూమిలో కనబడునవన్ని /
ప్రభువా నిన్నే కీర్తించున్
2•
అడవిలో నివసించువన్నీ /
ఈ సుడిగాలియు మంచును
భూమిపై నున్నవన్నీ /
దేవా నిన్నే పొగడును
3•
నీటిలో నివసించు ప్రాణుల్ /
ఈ భువిలోని జీవరాసులు
ఆకాశమున ఎగురున వన్ని /
ప్రభువా నిన్నే కీర్తంచున్