కృపలను తలంచుచు ఆయుష్కాలమంత

కృపలను తలంచుచు ఆయుష్కాలమంత

కృపలను తలంచుచు ఆయుష్కాలమంత
ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ ॥కృపలను॥

1•
మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను
ముట్టునని సెలవిచ్చిన దేవుడు
కాచెను గతకాలం నన్ను ॥కృప॥

2•
రూపింపబడియున్న ఏ ఆయుధముండినను
నాకు విరోధమై వర్ధిల్లదుయని
చెప్పిన మాట సత్యం ప్రభువు ။కృప။

3•
కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయము యేసు ။కృప။

4•
సర్వోన్నతుడైన నా దేవునితో చేరి
సతతము తన కృపవెల్లడిచేయ
స్తుతులతో నింపెను ఇలలో ။కృప။

5•
హల్లెలూయా ఆమెన్ హా నా కెంతో ఆనందమే
సీయోన్ నివాసం నా కెంతో ఆనందం
ఆనందం మానందమే ఆమెన్ ။కృప။

Leave a Comment