క్రొత్తయేడు మొదలు బెట్టెను మన

క్రొత్తయేడు మొదలు బెట్టెను మన

క్రొత్తయేడు మొదలు బెట్టెను /
మన బ్రతుకునందు
క్రొత్త మనసు తోడ మీరు /
క్రొత్తయేట ప్రభుని సేవ
దత్తరపడకుండజేయు /
టుత్తమో త్తమంబు జూడ (క్రొత్తయేడు)

1.
పొందియున్న మేలు లన్నియు /
బొంకంబు మీఱడెందమందు /
స్మరణ జేయుడి /
యిందు మీరు మొదలు బెట్టు /
పందెమందు గెల్వవలయు
నందముగను రవిని బోలి /
సలయకుండ మెలయకుండ (క్రొత్తయేడు)

2.
మేలు సేయ దడ వొనర్పగా /
మీరెఱుగునట్లు/
కాలమంత నిరుడు గడచెగా /
ప్రాలుమాలి యుండకుండ /
జాల మేలు సేయవలయు
జాల జనముల కిమ్మాను /
యేలు నామ ఘనతకొఱకు (క్రొత్తయేడు)

3.
బలము లేని వార మయ్యును /
బల మొందవచ్చు /
గలిమి మీరగర్త వాక్కున/
అలయకుండ నడుగుచుండ /
నలగకుండ మోద మొంది /
బలమొసంగు సర్వవిధుల /
నెలమి మీరొనర్చుచుండ (క్రొత్తయేడు)

4.
ఇద్దరిత్రి నుండు నప్పుడే /
ఈశ్వరుని జనులు /
వృద్ధిబొంద జూడ వలయును /
బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధజేయ /
శుద్ధు లైనవారిలొ ప్ర /
సిద్ధు లగుచు వెలుగవచ్చు (క్రొత్తయేడు)

5.
పాపపంక మంటినప్పుడు /
ప్రభు క్రీస్తు యేసు ప్రాపూ జేరి మీరువేడగా /
నేపుమీఱ దనదు కరుణ /
బాస మంత గడిగివేసి
పాపరోగ చిహ్నలన్ని /
బాపివేసి శుద్ధిజేయు (క్రొత్తయేడు)

రచన : పులిపాక జగన్నాథం

Leave a Comment