క్రీస్తు వధువు సంఘమా సిద్ధపడెదము
క్రీస్తు వధువు సంఘమా సిద్ధపడెదము
మనప్రియుడు పిలుచుచున్నాడు సిద్ధపడెదము
ప్రభు రాకడ ఇక ఎంతో దూరము లేదు
ఆ దినము రాక ముందెనీవు మేలుకో ။క్రీస్తు။
1•
ఎంతో మరి ఎంతో ఘోరమైన
మన జీవిత పాపాలను కడుగుటకై
పరలోక తన మహిమను విడచివచ్చి
రారమ్మని పిలచెను ఆ ప్రియుడేసె
2•
దూతలు పరిశుద్ధులచే పొగడబడె
నిజదేవుని సన్నిధిలో నిలువుటకై
తన రక్తము క్రయ ధనముగ చెల్లించెను
రారమ్మని పిలిచెను ఆ ప్రియుడేసె ||క్రీస్తు||
3•
కడబూర మ్రోగగనే మహిమ శరీరం
కృపకాలం నిలిచియుండి మేలుకొందుము
విడువబడితే ఘోరమైన నిత్య నరకము
రారమ్మని పిలిచెను ఆ ప్రియుడేసె ||క్రీస్తు||