క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాప మంతయు

క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాప మంతయు

క్రీస్తు పుట్టెను పశుల పాకలో /
పాప మంతయు రూపుమాపెను
సర్వలోకమున్ విమోచించన్ /
రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమాధానమే /
ఆనందమే పరమానందమే ॥2॥
గొల్లలొచ్చి, జ్ఞానులొచ్చి,
యేసును చూచి కానుకలిచ్చి
పాటలు పాడి, నాట్యమాడి, పరవశించిరి

1•
పరలోక దూతాళి పాటపాడగా /
పామరుల హృదయాలు పరవశించగా
అజ్ఞానము అదృశ్యమాయెను /
అంధకార బంధకములు తొలగిపోయెను

2•
కరుణగల రక్షకుడు ధరకేగెను /
పరమును వీడి కడుదీనుడాయెను
వరములనొసగ పరమ తండ్రి తనయుని /
మన కొసగెను రక్షకుడు ఈ శుభవేళ ॥సంతో॥


రచన: రెవ. కె.తిమోతి

Leave a Comment