క్రీస్తు జన్మించె లోకాన అందరికి

క్రీస్తు జన్మించె లోకాన అందరికి

క్రీస్తు జన్మించె లోకాన అందరికి
క్రీస్తు ఉదయించె హృదయాన ఎందరికి?
క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది/
ఏదీ ఏటి బదులేదీ

1•
ఆకాశాన దూతల స్వరమును విని
పశువుల శాలలో శిశువును కనుగొని
విశ్వాసముతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు
నిజ విశ్వాసులు ఎందురు ఈనాడు?॥క్రిస్మస్॥

2•
తూర్పు దిక్కున చుక్కను కనుగొని
ఓర్పున దేవుని ఉపదేశము విని
వెలుగుదారి పయనించిరి జ్ఞానులు ఆనాడు
మరి నిజ జ్ఞానులు ఎందరు ఈనాడు ॥క్రిస్మస్॥

Leave a Comment